ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

33% రిజర్వేషన్ ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీ: మహిళా మోర్చా చీఫ్

ABN, First Publish Date - 2021-07-28T21:28:24+05:30

మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అందించే ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ మహిళా మోర్చా విభాగం అధినేత వనతి శ్రీనివాసన్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అందించే ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ మహిళా మోర్చా విభాగం అధినేత వనతి శ్రీనివాసన్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నూతనంగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి, మీనాక్షి లేఖి, రేణుక సింగ్, శోభా కరందాల్జే, అన్నపూర్ణ దేవి, ప్రతిభా భౌమిక్, డాక్టర్ భార్తి పవార్‌లను అభినందించారు. ‘‘మహిళలకు ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారతను చాటే ఏకైకా పార్టీ భారతీయ జనతా పార్టీయే. కేవలం టికెట్లు ఇవ్వడమే కాకుండా మంత్రివర్గంలో వారికి సముచిత స్థానం కల్పించే పార్టీ కూడా బీజేపీనే’’ అని వనతి పేర్కొన్నారు.


అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అధినేత జేపీ నడ్డా మాట్లాడుతూ ‘‘వందల ఏళ్లుగా మహిళలను గౌరవిస్తున్న నేల ఇది. మహిళలను గౌరవించడం, ఉన్నతంగా చూడడం ఇక్కడి సంస్కృతిలో భాగం. ప్రపంచం మొత్తం మన సంస్కృతి నుంచి ఎంతో నేర్చుకుంటోంది. మన సంస్కృతిలో మహిళలే మొదటి ప్రాధాన్యత. మహిళలకు గౌరవం లేని చోట సాధికారత ఉండదు. మహిళలను గౌరవించే చోట అభివృద్ధి ఆగదు’’ అని అన్నారు.

Updated Date - 2021-07-28T21:28:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising