ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక్కడ పురుషులకు మాత్రమే !

ABN, First Publish Date - 2021-08-04T13:08:58+05:30

కేవలం పురుషులు మాత్రమే పాల్గొనే ఆలయ ఉత్సవం మదురై జిల్లాలో ఘనంగా జరిగింది. ఈ ఆలయ ఉత్సవంలో వంద మేకలు, 600 కోళ్లు బలిచ్చి ఉప్పు, వేపాకుతో వండి స్వామి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): కేవలం పురుషులు మాత్రమే పాల్గొనే ఆలయ ఉత్సవం మదురై జిల్లాలో ఘనంగా జరిగింది. ఈ ఆలయ ఉత్సవంలో వంద మేకలు, 600 కోళ్లు బలిచ్చి ఉప్పు, వేపాకుతో వండి స్వామికి నైవేధ్యం పెట్టారు. మదురై జిల్లా వీరసూడా మణిపట్టి, సుందరరాజ పురం, కచ్చి రాయన్‌పట్టి అనే మూడు గ్రామాలకు చెందిన ఐందుమొళి స్వామి ఆలయంలో కల్లు నైవేద్య ఉత్సవం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరుగుతోంది. సోమవారం ఈ  ఉత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు స్వామి వారిని నైవేధ్యంగా వంద మేకలు, 600 కోళ్లు బలిచ్చారు. అనంతరం మూడు గ్రామాలకు చెందిన పురుషులు మాత్రం పాల్గొని, వరుసగా ఏర్పాటుచేసి పొయ్యిలపై మట్టికుండల్లో బలి మాంసం వండారు. ఈ వంటకు ఉప్పు, వేపాకులు మాత్రమే వినియోగించారు. అనంతరం మాంసాన్ని స్వామి వారికి నైవేధ్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ముస్లింల ప్రత్యేక నమాజు, అనంతరం చక్కెర మార్చుకొనే కార్యక్రమాలు జరిగాయి. నైవేధ్యం అనంతరం మహిళలు, పిల్లలతో పాటు అందరూ విందులో పాల్గొనేందుకు అనుమతించారు.

Updated Date - 2021-08-04T13:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising