ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమనాథ్ మందిరంపై అభ్యంతరకరంగా మాట్లాడిన వ్యక్తిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-03-18T16:02:33+05:30

గుజరాత్‌లోని సోమనాథ్ మందిర ధ్వంసానికి పాల్పడిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమనాథ్: గుజరాత్‌లోని సోమనాథ్ మందిర ధ్వంసానికి పాల్పడిన మహమ్మద్ గజనీ, అరబ్ దురాక్రమణదారు మొహమ్మద్ బిన్ కాసిమ్‌లను కీర్తిస్తూ మతపరమైన విద్వేషాలకు పురిగొల్పిన ఒక అజ్ఞాత వ్యక్తిపై ప్రాథమికంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రసిద్ధ సోమనాథ్ మందిరానికి సుమారు కిలోమీటరు దూరంలో ఈ వీడియోను షూట్ చేశారు. 


ఈ వీడియోలో మహమ్మద్ గజనీ... ఆలయాన్ని ధ్వంసం చేయడం గురించి నిందితుడు వివరిస్తూ, గజనీ, బిన్ కాసిమ్‌లను కొనియాడాడు. దీనిపై సోమనాథ్ మందిర ట్రస్ట్ మేనేజర్ విజయ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమనాథ్ పోలీస్ స్టేషన్ అధికారి రాహుల్ త్రిపాఠి మాట్లాడుతూ ప్రాథమిక దర్యాప్తులో...దేశానికి వెలుపలి వ్యక్తి ఎవరో ఏడాది క్రితం ఈ వీడియో తీశారని, దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అయితే ఇది జరిగిన తరువాత ఆ యూట్యూబర్ మరో వీడియో పోస్టు చేస్తూ, దానిలో తాను చేసిన పనికి క్షమాపణ కోరాడు. తన వీడియో కారణంగా భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నాడు.

Updated Date - 2021-03-18T16:02:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising