ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Bengal: జ్వరాలతో 130 మంది పిల్లలు ఆసుపత్రి పాలు

ABN, First Publish Date - 2021-09-14T15:02:48+05:30

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తీవ్రమైన జ్వరం, విరేచనాలతో 130 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జల్పాయిగురి: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తీవ్రమైన జ్వరం, విరేచనాలతో 130 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలకు అధిక ప్రమాదం కలిగిస్తున్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో జల్పాయిగురి సదర్ ఆసుపత్రిలో 130 మంది తీవ్ర అనారోగ్యంతో చేరడం ఆందోళన కలిగిస్తోంది.ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా మారడంతో వారిని బెంగాల్ మెడికల్ కళాశాలకు తరలించామని వైద్యఆరోగ్యశాఖాధికారి చెప్పారు. పిల్లలు జ్వరాలతో అల్లాడుతున్న దృష్ట్యా వారి కోసం ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని వైద్యులు చెప్పారు. జ్వరాల పాలైన పిల్లలకు అవసరమైతే కొవిడ్ పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పారు.జల్పాయిగురి జిల్లా మెజిస్ట్రేట్ మౌమిత గోదార బసు పరిస్థితులను అంచనా వేసేందుకు ఆసుపత్రికి వచ్చి వైద్యులతో సమీక్షించారు.


Updated Date - 2021-09-14T15:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising