ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఎల్ వర్సిటీకి... 'వన్ డిస్ట్రిక్ట్ వన్ గ్రీన్ ఛాంపియన్' స్వచ్ఛతా అవార్డు...

ABN, First Publish Date - 2021-06-11T23:28:00+05:30

కేఎల్ విశ్వవిద్యాలయానికి కేంద్రం... ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ గ్రీన్ ఛాంపియన్’ అవార్డును ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : కేఎల్ విశ్వవిద్యాలయానికి కేంద్రం... ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ గ్రీన్ ఛాంపియన్’ అవార్డును ప్రకటించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి(ఎంజీఎన్‌సీఆర్‌ఈ)... స్వచ్ఛ భారత్ చొరవకు చేసిన కృషికి విద్యా సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. పరిశుభ్రత,  పచ్చదనం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రీన్ క్యాంపస్ డ్రైవ్, కోవిడ్ -19 అనంతర జాగ్రత్తలు పాటించడం, ఇతర సామాజిక దూర ప్రమాణాలను పాటించడం వంటి వివిధ పారామితులు ఈ అవార్డు ముసాయిదాలో  ఉంటాయి.


 "భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చే క్రమంలో మా వంతు కృషికి గర్వపడుతున్నాం. సామాజిక బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో అందించడంలో మా నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనం.  ఆరోగ్యకరమైన మరియు ప్రభావవంతమైన వాతావరణాన్ని అందించడం విద్యార్థుల అభివృద్ధి  కేఎల్  విశ్వవిద్యాలయం ముఖ్యోద్దేశం. మనకోసం సృష్టించిన బెంచ్ మార్కును సాధించడానికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సిన క్రమంలో... పలు అంశాలు,  జాగ్రత్తలను తీసుకోవడం జరిగింది.


ఇది... ఆయా విభాగాలు, శాఖలు, సామాజిక సేవా డ్రైవ్‌ల సమిష్టి కృషి ఫలితం. తద్వారా...  క్యాంపస్‌ను ఆకుపచ్చగా, పరిశుభ్రంగా నిర్వహించడంలో విద్యార్థులు, సిబ్బంది సహకారం ఎంతగానో ఉన్నాయి. కరోనా మహమ్మారి  పరిస్థితిల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన క్రమంలోనే ఈ కృషి జరుగుతోంది’... అని కేఎల్ వర్సిటీ ప్రెసిడెంట్ కొనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-11T23:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising