ఆర్యన్ ఖాన్‌కు మరోసారీ!
ABN, First Publish Date - 2021-10-21T08:09:47+05:30
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. డ్రగ్స్ కేసులో...
బెయిలు నిరాకరించిన ప్రత్యేక కోర్టు
ముంబై, అక్టోబరు 20: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌కు బెయిలు ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద నమోదయ్యే కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్జి వీవీ పాటిల్ బుధవారం ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాల బెయిల్ పిటిషన్లను తిరస్కరించా రు. ముంబై తీరప్రాంతంలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ పట్టుబడిన కేసులో మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అక్టోబరు 3న ఆర్యన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆర్యన్ పలుమార్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. బుధవారం విచారణలో భాగంగా ఎన్సీబీ.. కోర్టుకు పలు ఆధారాలు సమర్పించింది. ఓ నటితో ఆర్యన్ డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపింది. డ్రగ్స్ విక్రేతలకు అతను రెగ్యులర్ కస్టమర్ అని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించింది. వాదనలు విన్న జడ్జి ఆర్యన్‌కు బెయిలు నిరాకరించారు. ప్రత్యేక కోర్టులో బెయిలు రాకపోవడంతో ఆర్యన్ తరఫు న్యాయవాదులు వెంటనే బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు బెయిలు నిరాకరించడంతో ఆర్యన్ మరికొంతకాలం ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లోనే ఉండక తప్పేలా లేదు.
Updated Date - 2021-10-21T08:09:47+05:30 IST