ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌ ముప్పు తీవ్రమే!

ABN, First Publish Date - 2021-11-30T07:51:59+05:30

ఒమ్రైకాన్‌ వేరియంట్‌తో ముప్పు తీవ్రమేనని.. పరిణామాలూ అదే స్థాయిలో ఉండే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిణామాలూ అదే స్థాయిలో: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా, నవంబరు 29: ఒమ్రైకాన్‌ వేరియంట్‌తో ముప్పు తీవ్రమేనని.. పరిణామాలూ అదే స్థాయిలో ఉండే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వేరియంట్‌ అన్ని దేశాలకూ వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంది. వ్యాప్తి వేగం, తీవ్ర అనారోగ్యానికి దారితీసే అంశాలపై స్పష్టత లేదని వివరించింది. ఒమైక్రాన్‌తో మరో వేవ్‌ తలెత్తితే పరిణామాలు దారుణంగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఇప్పటివరకైతే మరణాలు సంభవించలేదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఓ కొలిక్కి వస్తే ఏ విషయమైనదీ తేలుతుందని వివరించింది. మరోవైపు ఒమైక్రాన్‌ పుట్టుక.. టీకా పంపిణీలో దేశాల మధ్య అసమానతలకు ప్రతిరూపమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానమ్‌ అన్నారు. 


స్థానిక వ్యాప్తి!

యూర్‌పలోని పోర్చుగల్‌కు చెందిన బెలెనెసెస్‌ సాకర్‌ క్లబ్‌ జట్టు సభ్యులు 13 మందికి కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయింది. వీరిలో ఒక్కరే దక్షిణాఫ్రికాలో పర్యటించినవారు. మిగతా అందరికీ స్థానిక వ్యాప్తి ద్వారా సోకినట్లు భావిస్తున్నారు.  కాగా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పరిధిలోని స్కాట్లాండ్‌లో సోమవారం ఆరుగురికి ఒమైక్రాన్‌ సోకింది. వీరిలో కొందరికి ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన చర్రిత లేదు. మరోవైపు ఒమైక్రాన్‌ ఆందోళనతో జపాన్‌ సరిహద్దులను మూసివేసింది. నెదర్లాండ్స్‌లో 13, ఆస్ట్రేలియాలో 4, కెనడా, హాంకాంగ్‌లో రెండేసి  కేసులు వచ్చాయి.

Updated Date - 2021-11-30T07:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising