ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఒమైక్రాన్‌’ నిర్ధారణ వేగవంతానికి ‘ఎస్‌జీటీఎఫ్‌’

ABN, First Publish Date - 2021-12-05T08:15:34+05:30

ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ కలకలం నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ప్రఖ్యాత నిపుణుడు,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్‌, డిసెంబరు 4 : ఒమైక్రాన్‌ కరోనా వేరియంట్‌ కలకలం నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల ప్రఖ్యాత నిపుణుడు, శాస్త్రవేత్త కృష్ణ ఖైర్నార్‌ కీలక సూచనలతో ముందుకొచ్చారు. ఒమైక్రాన్‌ కేసులను త్వరితగతిన నిర్ధారించేందుకు ‘ఎస్‌ జీన్‌ టార్గెట్‌ ఫెయిల్యూర్‌’ (ఎస్‌జీటీఎఫ్‌) పద్ధతి బాగా ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. వైర్‌సలో ‘ఎస్‌’, ‘ఎన్‌’, ‘ఈ’, ‘ఎన్‌’, ‘ఓఆర్‌ఎఫ్‌’, ‘ఆర్‌డీఆర్‌పీ’ అనే వైరల్‌ జన్యువులు ఉంటాయని ఆయన వివరించారు. ఒకవేళ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేసిన శాంపిల్‌లో ‘ఎస్‌’ వైరల్‌ జన్యువు జాడ లేకుండా.. ఓఆర్‌ఎఫ్‌, ఎన్‌ అనే జన్యువులు మాత్రమే ఉంటే దాన్ని దాదాపు ఒమైక్రాన్‌ కేసుగా పరిగణించవచ్చన్నారు. అయితే పూర్తి స్థాయి నిర్ధారణ కోసం ఈ విధమైన ఫలితాలు వచ్చిన శాంపిళ్లను వెంటనే జన్యుక్రమ విశ్లేషణ చేసేందుకు ల్యాబ్‌కు పంపించాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-05T08:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising