ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌తో హెచ్ఐవీ...!

ABN, First Publish Date - 2021-12-23T19:11:54+05:30

కరోనా ఉగ్రరూపానికి అంతంలేకుండా పోతోంది. ఒమైక్రాన్ రూపంలో మహమ్మారి జనజీవనాన్ని స్తంభింపచేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉగ్రరూపానికి అంతంలేకుండా పోతోంది. ఒమైక్రాన్ రూపంలో మహమ్మారి జనజీవనాన్ని స్తంభింపచేస్తోంది. దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమైక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఒమైక్రాన్ పేరు చెబితే చాలు. జనం హడలెత్తిపోతున్నారు. దక్షిణాఫ్రికాలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ఐవీకి గురయ్యారని ఐరాస దేశాల హెచ్ఐవీ, ఎయిడ్స్ సంయుక్త నియంత్రణ కార్యక్రమం.. యూఎన్ఏ ఓ నివేదిక ఇచ్చింది. హెచ్ఐవీ సోకినా.. ఎలాంటి మందులు వాడని వారి రోగ నిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి ఇతరాత్ర వ్యాధులకు ఆలవాలంగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని, ఆమె శరీరంలో హెచ్ఐవీ వైరస్ కారణంగా కరోనా పరివర్తనాలకు గురై ఒమైక్రాన్‌గా అవతరించి ఉంటుందని పరిశోధకులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంకు చెందిన డాక్టర్ కెంపు బృందం కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. హెచ్ఐవీ వైరస్ తిష్ట వేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉంటారు కాబట్టి... అక్కడే ఒమైక్రాన్‌గా అవతరించి ఉండొచ్చని డాక్టర్ కెంపు అన్నారు. దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమైక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ ఉందని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఉంటారన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.

Updated Date - 2021-12-23T19:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising