ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Christmas పార్టీలకు దూరంగా ఉండండి...ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ సూచన

ABN, First Publish Date - 2021-12-20T17:37:07+05:30

ముంబై నగరంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీని కట్టడిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) దృష్టి సారించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ముంబై నగరంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీని కట్టడిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) దృష్టి సారించింది. భవిష్యత్తులో లాక్‌డౌన్ పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రజలు క్రిస్మస్ పండుగ, కొత్త సంవత్సర వేడుకలకు, పార్టీలకు దూరంగా ఉండాలని బీఎంసీ చీఫ్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ కోరారు. ఒమైక్రాన్ వైరస్ కేసుల సంఖ్య మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ సూచించింది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 54 ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా వస్తుండటంతో ఒమైక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 


క్రిస్మస్, కొత్తసంవత్సరం సందర్భంగా పార్టీలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేశామని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ హెచ్చరించారు. ప్రజలు మాస్కులు ధరించాలని, రెండు డోసుల టీకాలు వేసుకోవాలని బీఎంసీ చీఫ్ ఇక్బాల్ సింగ్ కోరారు. ఒమైక్రాన్ వైరస్ పలు దేశాల్లో అదుపు తప్పడంతో మళ్లీ లాక్ డౌన్ విధించారని ఆయన చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మాల్స్ లలో కొవిడ్-19 నియమాలు పాటించాలని చాహల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే అంటువ్యాధుల చట్టం, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన పౌరులందరూ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లను తీసుకోవాలని సూచించారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌తో సహా పబ్లిక్ ప్రదేశాలలో పూర్తిగా టీకాలు వేసిన వారిని మాత్రమే అనుమతిస్తామని చీఫ్ సెక్రటరీ చెప్పారు.మహారాష్ట్రలో ఇప్పటివరకు 54 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 22 మంది ముంబైకి చెందినవారు, అధికారిక సమాచారం ప్రకారం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ ద్వారా కనుగొనబడిన కేసులు ఉన్నాయి.


Updated Date - 2021-12-20T17:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising