ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌పై ఆందోళన వద్దు

ABN, First Publish Date - 2021-12-24T18:01:24+05:30

ఒమైక్రాన్‌ వైరస్‌పై ప్రజలు భయాందోళనలు చెందనవసరం లేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధా కృష్ణన్‌ తెలిపారు. స్థానిక పాత బస్టాండ్‌ సమీపంలో బుధవారం సాయంత్రం ఒమైక్రాన్‌ వైరస్‌పై అవగాహన, కరోనా టీకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌


వేలూరు(చెన్నై): ఒమైక్రాన్‌ వైరస్‌పై ప్రజలు భయాందోళనలు చెందనవసరం లేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధా కృష్ణన్‌ తెలిపారు. స్థానిక పాత బస్టాండ్‌ సమీపంలో బుధవారం సాయంత్రం ఒమైక్రాన్‌ వైరస్‌పై అవగాహన, కరోనా టీకా ప్రాధాన్యత తెలిపేలా అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ప్రారంభించిన రాధాకృష్ణన్‌ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఒమైక్రాన్‌ వైరస్‌ 98 దేశాల్లో ప్రబలిందని, ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండగా, మరణాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ వైరస్‌పై కరోనా టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని, అర్హులైన వారందరూ తప్పక టీకా వేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 95 లక్షల మంది రెండవ డోసు టీకా వేసుకోలేదన్నారు. అదే సమయంలో 18 నుంచి 44 ఏళ్లలోపున్న 68 లక్షల మంది, 60 ఏళ్లకు పైబడిన 43 లక్షలమంది ఇంకా మొదటి డోసు కూడా వేయించుకోలేదని, అధికారులు వారిని గుర్తించి టీకాలు వేయాలని సూచించామని రాధాకృష్ణన్‌ తెలిపారు.

Updated Date - 2021-12-24T18:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising