ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందినా Lockdown విధించం

ABN, First Publish Date - 2021-12-04T16:30:52+05:30

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందినా కఠిన లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. నగరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాలో కొత్తగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

          - మంత్రి సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందినా కఠిన లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. నగరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగుచూసిన ఒమైక్రాన్‌ వైరస్‌ను అడ్డుకొనేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తం గా పటిష్ఠమైన చర్యలు చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరి స్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒమైక్రాన్‌ నిరోధక చర్యలను ముమ్మరం చేశామని, ప్రయాణికులకు ఫీవర్‌ టెస్ట్‌ అనంతరం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇందులో నెగటివ్‌ ఫలితాలు వచ్చినప్పటికీ వారం రోజులు వారిళ్లలోనే క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో 1,868 మందికి ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహించి, ఒక్కొక్కరికి ఫీజుగా రూ.700 ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా, ఒమైక్రాన్‌ ప్రభావం లేని దేశాల నుంచి వస్తున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లోనే టెస్ట్‌లు నిర్వ హించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.  

Updated Date - 2021-12-04T16:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising