ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌ నియంత్రణకు మెడికల్‌ కాలేజీలు సిద్ధం కావాలి

ABN, First Publish Date - 2021-12-04T18:27:13+05:30

ఒమైక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణకు రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కళాశాలలు సిద్ధం కావాలని, వైరస్‌ బాధితులకు వైద్యం అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

          - 18వేల మంది నర్సులకు శిక్షణ: మంత్రి సుధాకర్‌


బెంగళూరు: ఒమైక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణకు రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కళాశాలలు సిద్ధం కావాలని, వైరస్‌ బాధితులకు వైద్యం అందుబాటులో ఉండాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆరోగ్యసౌధలో రాష్ట్రంలోని 21 మెడికల్‌ కళాశాలల డైరెక్టర్లు, జిల్లా, నగరాల ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ఒమైక్రాన్‌ నియంత్రణపై సమావేశం నిర్వహించారు. బెంగళూరు పరిధికి చెందిన అధికారులు పాల్గొనగా మిగిలిన జిల్లాల అధికారులు, డైరెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భాగస్వామ్యులయ్యారు. మెడికల్‌ కళాశాలలోని హెచ్‌ఓడీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొ ఫెసర్లు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలన్నారు. పీజీ వి ద్యార్థుల ద్వారా నిరంతరంగా చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమావేశం అ నంతరం మంత్రి సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ అన్ని మెడికల్‌ కళాశాలలోను ఎంతటి పరిస్థితులు ఎదురైనా సేవలందించేందుకు సిద్ధంగా ఉండేలా సూచించామన్నారు. ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలలో పడకలు రిజర్వుచేసే విషయమై చర్చించామన్నారు. రాష్ట్రంలో వైద్యసౌలభ్యాలు పెంచుతామన్నారు. పారామెడికల్‌, నర్సింగ్‌ కో ర్సులు చేస్తున్న 18 వేల మందికి నెలరోజుల పాటు శిక్షణలిచ్చి విధులకు వినియోగించుకోదలచినట్లు తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకమైన ఐసీయూను సిద్ధం చేస్తున్నామన్నారు. రెసిడెంట్‌ డాక్టర్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు సాంకేతికంగా చెల్లింపులు జరగలేదని వెంటనే ప్రక్రియ పూర్తీ చేస్తామన్నారు. ప్రస్తుత సమయంలో సమ్మె వంటి ఆలోచనలు సమంజసం కాదని సూచించామన్నారు. ఆఫ్రికా నుంచి వచ్చిన 57 మంది ప్రయాణికుల పైకి 10 మందిని గుర్తించామన్నారు. వీరిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. పోలీసు, రెవిన్యూశాఖల సమన్వయంతో కొవిడ్‌ నియంత్రణ చర్యలు నిరంతరంగా కొనసాగిస్తామన్నారు.

Updated Date - 2021-12-04T18:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising