ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ కాలేదు

ABN, First Publish Date - 2021-12-05T16:32:28+05:30

రాష్ట్రంలో ఇంకా ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ కాలేదని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం సూచించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌


పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో ఇంకా ఒమైక్రాన్‌ కేసులు నిర్ధారణ కాలేదని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. నగరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం సూచించిన విధంగా రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇంకా ఒమైక్రాస్‌ వైరస్‌ నిర్ధారణ కాలేదని తెలిపారు. కరోనా నిర్ధారణకు, ఒమైక్రాన్‌ నిర్ధారణకు తేడా ఉందని తెలిపారు. కానీ కరోనా - ఒమైక్రాన్‌ చికిత్సల్లో ఎలాంటి తేడా లేదన్నారు. ఈ రెండు ఒకే విధమైన లక్షణాలు కలిగి వుంటాయన్నారు. ఒమైక్రాన్‌ వైరస్‌ వేగంగా ప్రబలుతుందనే విషయం వాస్తవమని, కానీ ప్రస్తుతం ఆ వైరస్‌ లక్షణాలు తక్కువగానే ఉన్నాయని తెలిపారు. మొట్టమొదటిసారిగా కరోనా వచ్చిన సమయంలో కూడా తీవ్రత తక్కువగా ఉందని, ఒక దశ దాటిన తర్వాత వైరస్‌ వ్యాప్తి అధికమైందన్నారు. కరోనా వచ్చిన కొత్తలో టీకా కానీ చికిత్స అవసరమైన మందులు కానీ లేని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం టీకా, ఆక్సిజన్‌, క్వారంటైన్‌ కేంద్రాలు అని పలు సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.  

Updated Date - 2021-12-05T16:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising