ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగవద్గీతలో ప్రతి శ్లోకం సరైన దారి చూపుతుంది : ఓం బిర్లా

ABN, First Publish Date - 2021-12-11T23:40:30+05:30

వర్తమానంలో జీవించే ప్రతి వ్యక్తి భగవద్గీతను అనుసరిస్తారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుక్షేత్ర (హర్యానా) : వర్తమానంలో జీవించే ప్రతి వ్యక్తి భగవద్గీతను అనుసరిస్తారని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా శనివారం చెప్పారు. వ్యక్తి సరైన దారిలో నడిచేందుకు  భగవద్గీతలోని ప్రతి అధ్యాయం, ప్రతి శ్లోకం మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడటానికి సహాయపడుతుందని అన్నారు. ఆయన హర్యానాలోని కురుక్షేత్రలో జరుగుతున్న అంతర్జాతీయ గీతా మహోత్సవాలలో పాల్గొన్నారు. 


కురుక్షేత్రలో డిసెంబరు 2న ప్రారంభమైన అంతర్జాతీయ గీతా మహోత్సవాలు ఈ నెల 19 వరకు జరుగుతాయి. 164 చోట్ల ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తార్ బుధవారం ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ అంతర్జాతీయ గీతా మహోత్సవాల వల్ల కురుక్షేత్రకు ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. కురుక్షేత్రలోని జ్యోతిసార్ వద్ద మహాభారత థీమ్ పార్క్‌ కోసం రూ.205 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఇక్కడి మతపరమైన ప్రాధాన్యంగల ప్రదేశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా సాయపడుతోందని చెప్పారు. 


Updated Date - 2021-12-11T23:40:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising