ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ని అధ్యక్షుడిగా చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ ప్రతిపాదన

ABN, First Publish Date - 2021-09-13T01:30:40+05:30

రాహుల్ గాంధీ నిబద్ధతను మేము గుర్తించాం. ఆయన నాయకత్వం మంచి భవిష్యత్‌ను చూపిస్తుందని మాకు నమ్మకం ఉంది. సమాజానికి మేలు జరుగుతుందని కూడా అనుకుంటున్నాం. అందుకే రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ పార్టీ జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీని తిరిగి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించాలని యూత్ కాంగ్రెస్ అప్పట్లో ప్రతిపాదించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) కూడా ఇదే ప్రతిపాదన చేసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ‘సంకల్ప్’ అనే కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘రాహుల్ గాంధీ అగ్రనేత, నిజాయితీ కలిగిన వ్యక్తి. విద్యార్థుల కోసం ఆయన తన బలమైన గొంతుకను వినిపించారు. అంతే కాకుండా విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఆయన ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉన్నారు. విద్యార్థిల్లో ప్రజాస్వామ్యం, పారదర్శకత పెంచుతున్నారు. విద్యార్థులతో సోదరభావం కలిగిన వ్యక్తి. రాహుల్ గాంధీ నిబద్ధతను మేము గుర్తించాం. ఆయన నాయకత్వం మంచి భవిష్యత్‌ను చూపిస్తుందని మాకు నమ్మకం ఉంది. సమాజానికి మేలు జరుగుతుందని కూడా అనుకుంటున్నాం. అందుకే రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించాలి’’ అని ఎన్‌ఎస్‌యూఐ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-09-13T01:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising