ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

noise pollution: శబ్ధ కాలుష్యం సృష్టిస్తే రూ.లక్ష జరిమానా

ABN, First Publish Date - 2021-07-10T18:35:09+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శబ్ధ కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రకటన

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శబ్ధ కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఎవరైనా శబ్ధ కాలుష్యం సృష్టిస్తే లక్షరూపాయల జరిమానా విధిస్తామని కాలుష్య నియంత్రణ కమిటీ వెల్లడించింది. ఎవరైనా నివాస ప్రాంతాల్లో బాణ సంచా కాలిస్తే వెయ్యిరూపాయలు, వాణిజ్యప్రాంతాల్లో బాణసంచా కాలిస్తే రూ.3వేలు జరిమానా విధించాలని కమిటీ నిర్ణయించింది. ర్యాలీలు, వివాహ ఊరేగింపులు, మతపరమైన సమావేశాల సందర్భంగా బాణసంచా కాల్చరాదనే నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేలు, రూ.20వేల జరిమానాలు తప్పవని కమిటీ తెలిపింది. రెండవసారి శబ్ధ కాలుష్యం సృష్టిస్తే రూ.40వేలు, రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు శబ్ధ కాలుష్యం చేస్తే వారికి లక్షరూపాయల జరిమానా విధిస్తామని కమిటీ వివరించింది.

Updated Date - 2021-07-10T18:35:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising