ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక Adani చేతికి జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

ABN, First Publish Date - 2021-10-10T18:26:12+05:30

రాజస్థాన్‌లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ : రాజస్థాన్‌లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం రాత్రి నుంచి అదానీ గ్రూప్ వశం కాబోతోంది. రానున్న 50 ఏళ్ళపాటు కార్యకలాపాల నిర్వహణ, అభివృద్ధి, నిర్వహణ హక్కులను ఈ కంపెనీకి ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం ఈ కంపెనీకి లెటర్ ఆఫ్ అవార్డును భారత విమానాశ్రయాల సంస్థ (ఏఏఐ) గత ఏడాది జారీ చేసింది. 


ఈ విమానాశ్రయంలో కార్యకలాపాలను రెండు నెలల నుంచి అదానీ కంపెనీ అధికారులు పరిశీలిస్తున్నారు. గడచిన ఐదేళ్ళలో ఈ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలను బాగా అభివృద్ధి చేశారు. అయితే మూడో టెర్మినల్‌ను ఈ కంపెనీ అభివృద్ధి చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 167 మంది ఏఏఐ ఉద్యోగులను అదానీ గ్రూప్ తీసుకుంటుంది. 


జైపూర్ విమానాశ్రయం డైరెక్టర్ జేఎస్ బల్హారా మాట్లాడుతూ, తాము మొత్తం విమానాశ్రయాన్ని అత్యాధునిక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో, మంచి స్థితిలో మెసర్స్ అదానీ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.  ప్రస్తుతం ఈ విమానాశ్రయం సామర్థ్యం తగిన స్థాయిలో ఉందని, రానున్న నాలుగైదేళ్ళలో మార్కెట్ పరిస్థితినిబట్టి మూడో టెర్మినల్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరం ఏర్పడవచ్చునని తెలిపారు. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), సీఎన్ఎస్ (కమ్యూనికేషన్, నేవిగేషన్ అండ్ సర్విలెన్స్) సర్వీసులను మాత్రమే ఇకపై ఏఏఐ అందజేస్తుందన్నారు. 


Updated Date - 2021-10-10T18:26:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising