ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర రాష్ట్రానికి కాదు.. అభ్యర్థులను విదేశాలకే పంపించిన పార్టీ

ABN, First Publish Date - 2021-04-11T22:16:03+05:30

అసోం ఫలితాలు రాజకీయ పార్టీలకు ఎంత జీవన్మరణ సమస్యగా మారిపోయాయో ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గౌహతి : అసోం ఫలితాలు రాజకీయ పార్టీలకు ఎంత జీవన్మరణ సమస్యగా మారిపోయాయో ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాలు రాకమునుపే తమ అభ్యర్థులను జైపూర్‌కు పంపించేసింది. మే 2 వరకూ వారెవ్వరూ అసోం ముఖం కూడా చూడడానికి వీల్లేదు. అలాగని ఇతర ప్రాంతానికీ వెళ్లడానికి లేదు. కేవలం జైపూర్ రిసార్టుల్లోనే ఉండాలని కాంగ్రెస్ పెద్దలు హుకూం కూడా చేశారు. మరోవైపు బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా తమ అభ్యర్థులను విదేశాలకు పంపిచేసింది. మొత్తం 11 మంది అభ్యర్థులుండగా, 10 మందిని విదేశాలకు పంపించేసింది. బీజేపీ గెలిస్తే, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెర లేపుతుందన్న భయంతోనే ఇలా జాగ్రత్తపడుతున్నామని నేతలు అంటున్నారు. వీరందర్నీ బీపీఎఫ్ అధిష్ఠానం సింగపూర్‌కు పంపించింది. ఈ విషయాన్ని మంత్రి ప్రమీలా రాణీ బ్రహ్మ ధృవీకరించారు. ‘‘నిజమే... ఆ అభ్యర్థులందరూ విదేశాలకు పయనమయ్యారు. అయితే ఏ దేశానికి వెళ్లారో మాత్రం తెలియదు. వారికి ఫోన్ చేయలేదు. బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తీయదని మేం భావించడం లేదు’’ అంటూ ప్రమీలా రాణి వ్యా్ఖ్యానించారు. 

Updated Date - 2021-04-11T22:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising