ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ..?

ABN, First Publish Date - 2021-12-24T18:51:57+05:30

దేశంలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్ణాటకలోనూ మరోసారి నైట్‌ కర్ఫ్యూ విధించే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - కేంద్రం ఆదేశాలతో అప్రమత్తం


బెంగళూరు: దేశంలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్ణాటకలోనూ మరోసారి నైట్‌ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒమైక్రాన్‌ ప్రభావం చూపకపోయినా గురువారం ఒక్కసారిగా 12 కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. బెంగళూరులో ఏ కంగా పదిమందికి ప్రబలడం మరింత ఆందోళనకరంగా మారింది. బెంగళూరు మహానగర పాలికె ఇప్పటికే ఒమైక్రాన్‌ను మూడో విడతగా భావించి డివిజన్ల వారీగా చర్యలకు సిద్ధమైంది. ఇదే తరుణంలో కేంద్రం కూడా పలుమార్గదర్శకాలు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగా బెంగళూరులో నైట్‌ క ర్ఫ్యూ విధించే ఆలోచనలో ఉన్నారు. దాదాపు నెలరోజులుగా 300కు అటుఇటుగా కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో బెంగళూరులోనే మూడింట రెండుభాగాలు నమోదవుతున్నాయి. దీంతో బెంగళూరులో కట్టడి చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. అయితే వాటిపై మరింత కఠినం చేసే అవకాశాలు లేకపోలేదు. శుక్రవారంతో బెళగావిలో జరుగుతున్న శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. ఆ వెంటనే ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బెంగళూరుకు చేరుకోనున్నారు. బెంగళూరు పాలికె అధికారులతో సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి చర్చలు జరపనున్నారు. 

Updated Date - 2021-12-24T18:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising