ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాతో వంధ్యత్వం రాదు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ABN, First Publish Date - 2021-06-22T04:04:08+05:30

కరోనా టీకాతో పురుషుల్లో లేదా మహిళల్లో వంధ్యత్వం వస్తుందనే చెప్పే శాస్త్రపరమైన ఆధారాలేవీ లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా టీకాతో పురుషుల్లో లేదా మహిళల్లో వంధ్యత్వం వస్తుందని చెప్పే శాస్త్రపరమైన ఆధారాలేవీ లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఇటువంటి అసత్యప్రచారాలు వదంతులు పోలియో టీకా కార్యక్రమంలోనూ వెలుగుచూసిన విషయాన్ని ప్రస్తావించింది. టీకాలు సురక్షితమైనవే కాకుండా వ్యాధిని నిరోధించడంలో మంచి ప్రభావం కనబరుస్తాయని కూడా కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాల ప్రభావాలను జంతువుల్లో పరీక్షించి ప్రమాదం లేదని తేల్చాకే మార్కెట్‌లోకి విడుదలైన విషయాన్నీ పేర్కొంది. వ్యాక్సినేషన్‌పై ఏర్పాటైన నిపుణులు కమిటీ కూడా గతంలో ఇదే సూచన చేసింది. బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా కరోనా టీకా తీసుకోవచ్చని, ఈ విషయంలో ఎటువంటి అనవసర భయాలకు తావు లేదని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-06-22T04:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising