ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Khel Ratna పేరు మార్పుపై విజ్ఞప్తుల రికార్డులు లేవు...

ABN, First Publish Date - 2021-11-07T16:27:35+05:30

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుగా పేరు మార్పుపై విజ్ఞప్తుల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుగా పేరు మార్పుపై విజ్ఞప్తుల రికార్డులు తమ దగ్గర లేవని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం సమాధానం ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త ఉచిత్ శర్మ ఇందుకు సంబంధించిన సమాచారం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అలాంటి సమాచారమేదీ తమ వద్ద లేదని  పీఎంఓ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఈ సమాధానంతో తృప్తిచెందని ఉచిత్ శర్మ దీనిపై సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్‌ (సీఐసీ)ను ఆశ్రయించారు.


పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ అధికారిని దండించాలంటూ ఆర్టీఐ కార్యకర్త చేసిన విజ్ఞప్తిని పీఎంఓలోని డైరక్టర్ అండ్ ఫస్ట్ అప్పిలేట్ అధారిటీ అమిక్ర్ సింగ్ తోసిపుచ్చారు. ఫస్ట్ అప్పీల్ దశలో ఇలాంటి విజ్ఞప్తులను స్వీకరించలేమని, సీఐసీ దృష్టికి దీనిని తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఫస్ట్ అప్పీల్‌పై విచారణ నిర్వహించ తీరుపై కూడా శర్మ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫస్ట్‌ అప్పీల్‌కు సంబంధించి అథారిటీ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని, పీఎంఓ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి నిర్ణయం తీసుకోవడానికి ముందు విచారణకు తనను ఆహ్వానించడం కానీ, కనీసం సమాచారం ఇవ్వడం కానీ జరగలేదని అన్నారు. ''నేను వేసిన మామూలు ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. ఖేల్‌రత్న అవార్డును మేజర్ ధ్యాన్ చంద్‌ అవార్డుగా మార్చాలని తనకు చాలా అభ్యర్థనలు వచ్చాయని ప్రధాని ట్వీట్ చేశారు. ఆ తర్వాతే సదరు విజ్ఞప్తులపై వివరాలు తాను తెలుసుకోవాలనుకున్నాను'' అని శర్మ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-07T16:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising