ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి లోపాలు లేవు.. కేంద్రం స్పష్టీకరణ

ABN, First Publish Date - 2021-03-03T02:57:13+05:30

కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి లోపాలూ లేవని కేంద్రం మంగళవారం నాడు స్పష్టం చేసింది. కరోనా టీకా కోసం పేరు నమోదు చేసే క్రమంలో అనేక మంది కొవిన్‌లోని లోపాల కారణంగా ఇబ్బంది పడ్డారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి లోపాలూ లేవని కేంద్రం మంగళవారం నాడు స్పష్టం చేసింది. కరోనా టీకా కోసం పేరు నమోదు చేసే క్రమంలో అనేక మంది కొవిన్‌లోని లోపాల కారణంగా ఇబ్బంది పడ్డారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. రెండో విడత టీకా కార్యక్రమంలో పేరు నమోదు కోసం అనేక మంది యాప్ కోసం వేతికి ఇబ్బంది పడ్డారని కేంద్రం స్పష్టం చేసింది. కొవిన్ పోర్టల్‌లో మాత్రమే వ్యక్తులు తమ పేరును నమోదు చేసుకోవాలని, ఇందుకోసం కేంద్రం ప్రత్యేకమైన యాప్ ఏదీ సిద్ధం చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 1 భారత్‌లో రెండో విడత టీకా కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మారు టీకా పంపిణీలో ప్రైవేటు ఆస్పత్రులను కూడా కేంద్రం భాగస్వాములను చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 27 వేల ఆస్పత్రుల్లో టీకాలు వేస్తుండగా.. వాటిలో 12 వేలకు పైగా ప్రైవేటు ఆస్పత్రులే ఉన్నాయి. తొలి విడత కార్యక్రమంలో వైద్య, ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాలు వేయగా ప్రస్తుతం 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక రోగాలు ఉన్నావారికి కరోనా టీకాలు వేస్తున్నారు. 

Updated Date - 2021-03-03T02:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising