ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా లేకుంటే నో ఎంట్రీ

ABN, First Publish Date - 2021-12-11T13:39:55+05:30

కరోనా మహమ్మారి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కొత్త నిబంధనలు విధించింది. కళాశాలలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందేనని, వ్యాక్సిన్‌ వేయించుకోని వారికి కళాశాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాస్కు కూడా తప్పనిసరి

- కళాశాల విద్యార్థులకు కొత్త నిబంధనలు

- మంత్రి ఎం.సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): కరోనా మహమ్మారి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కొత్త నిబంధనలు విధించింది. కళాశాలలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందేనని, వ్యాక్సిన్‌ వేయించుకోని వారికి కళాశాలలో ప్రవేశం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా ఖచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని తేల్చిచెప్పింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ప్రధాన కార్యాలయం రిప్పన్‌ భవనంలో శుక్రవారం ఉదయం నగరంలోని కళాశాలలు, హాస్టళ్ల లో పాటించాల్సిన కొవిడ్‌ భద్రత విధి విధానాలపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌, జీసీసీ కమిషనర్‌ గగన్‌దీప్‌సింగ్‌ బేదీ, ఉన్నత విద్యాశాఖ, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డా.కార్తికేయన్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ... కళాశాలలకు విద్యార్థులు మాస్కుధారణ, కొవిడ్‌ నిబంధనల పాటింపు తదితరాలను కఠినతరం చేస్తూ కొత్త నిబంధనలు జారీ చేశామన్నారు. కళాశాలకు రావాలంటే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించా ల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి తరగతి గది ప్రవేశద్వారంలో శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, డైనింగ్‌ హాల్‌లో ఒకేసారి ఎక్కువ మంది భోజనం చేయరాదని, తరగతులు ముగిశాక విద్యార్థులు గుంపులు గుంపులుగా బయటకు వెళ్లకుండా ప్రభుత్వం విధించిన నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 10,762 మందికి నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 17 మందికి పాజిటివ్‌ గుర్తించి క్వారంటైన్‌కు తరలించామన్నారు. వీరికి ఒమైక్రాన్‌ వైరస్‌ ఉందా అని నిర్ధారించేందుకు బెంగుళూరులోని ల్యాబ్‌కు తరలించినట్లు తెలిపారు. శుక్రవారం వరకు 13 మంది ఫలితాలు రాగా వారిలో డెల్టా వైరస్‌ ఉన్నట్లు తెలిసిందన్నారు. రాష్ట్రప్రభుత్వం కరోనా, డెల్టా తదితర వైరస్‌లను అడ్డుకొనేందుకు చేపట్టిన పటిష్ట చర్యల వల్ల ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క ఒమైక్రాన్‌ కేసు కూడా నమోదుకాలేదని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2021-12-11T13:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising