ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటులో మార్పు లేదు : కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2021-03-04T20:46:31+05:30

ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2020-21 ఆర్థిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా వడ్డీ రేటు 8.5 శాతం అనే సంగతి తెలిసిందే. 


సంతోష్ గంగ్వార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) బోర్డు 2020-21 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించిందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ వడ్డీ రేటు 8.5 శాతమేనని గుర్తు చేశారు. 


ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుల డిపాజిట్లపై 2020-21 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును నిర్ణయించేందుకు ఈపీఎఫ్ఓ బోర్డు గురువారం శ్రీనగర్‌లో సమావేశమైంది. ఈ వడ్డీ రేటును మార్చరాదని నిర్ణయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ వడ్డీ రేటు 8.65 శాతం ఉండేది. 



Updated Date - 2021-03-04T20:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising