ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు: నితీష్

ABN, First Publish Date - 2021-08-19T20:14:58+05:30

కులాలవారిగా జనగణన జరగాలనే డిమాండ్‌పై చర్చించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: కులాలవారిగా జనగణన జరగాలనే డిమాండ్‌పై చర్చించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరారు. సోమవారంనాడు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈవిషాయన్ని నితీష్ గురువారంనాడు ఒక అధికార ప్రకటనలో తెలియజేశారు. కులాలవారీ జనగణనను కోరేందుకు బీహార్ ప్రతినిధి బృందంతో కలిసి ప్రధానిని కలుస్తున్నానని, 23న అపాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలని అన్నారు.


బీహార్‌లో బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉన్న జేడీయూ కులాలవారీ జనగణన కోరుతోందని, ఇది కేవలం బీహార్ డిమాండ్ మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని నితీష్ ఇటీవల తెలిపారు. తమ పార్టీ ఎంపీలతో పాటు విపక్ష పార్టీల నేతలు కూడా ప్రధానిని అపాయింట్‌ కోరారని, ఇందుకు సంబంధించి లేఖ కూడా ప్రధానికి రాసామని చెప్పారు. కులాలవారీ జనగణపై 2019లో బీహార్ అసెంబ్లీలోనూ, మండలిలోనూ ఏకగ్రీవ తీర్మానం చేశామని, 2020లో మరోసారి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించామని చెప్పారు. కాగా, వచ్చే ఏడాది నాటికి 7 రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్తున్నందున కులాలవారీ జనగణన, దాని ప్రభావం దేశ రాజకీయాలపై పడే అవకాశం ఉందని, ఇది చాలా సున్నితమైన అంశమని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-08-19T20:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising