ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New delhi : నా భార్యకు చెప్పకుండా మామ ఇంటిని కూల్చేశా...

ABN, First Publish Date - 2021-09-17T15:31:03+05:30

కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన మామ గురించి మాట్లాడుతూ హాస్యం పండించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ : కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హర్యానా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన మామ గురించి మాట్లాడుతూ హాస్యం పండించారు. తాను భార్యకు చెప్పకుండానే రోడ్డు మధ్యలో ఉన్న మామ ఇంటిని కూల్చివేయాలని ఆదేశించినట్లు నితిన్ గడ్కరీ చెప్పారు. హర్యానా రాష్ట్రంలో ఢిల్లీ -ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కొత్తగా వివాహం చేసుకున్నపుడు జరిగిన సంఘటన గురించి మంత్రి నితిన్ గడ్కరీ గుర్తుచేసుకున్నారు. 


‘‘మా మామగారి ఇల్లు రోడ్డు మధ్యలో ఉండేది.రోడ్డు నిర్మాణం కోసం ఇంటిని కూల్చివేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు. దీంతో ఆ విషయం నా భార్యకు చెప్పకుండా, నేను మా మామగారి ఇంటిని కూల్చివేయమని అధికారులను ఆదేశించాను.’’ అని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. గడ్కరీ పాల్గొన్న కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గురుగ్రామ్ లోక్‌సభ సభ్యుడు రావు ఇందర్‌జిత్ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పరిపాలన, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.హర్యానాలో హైవేకి సంబంధించిన దాదాపు 160 కిలోమీటర్ల పనులు మార్చి 2022 నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు.

Updated Date - 2021-09-17T15:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising