ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘శూన్య’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన నీతీ ఆయోగ్

ABN, First Publish Date - 2021-09-16T01:08:02+05:30

కాలుష్యాన్ని విడుదల చేయని వాహనాలను ప్రోత్సహించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాలుష్యాన్ని విడుదల చేయని వాహనాలను ప్రోత్సహించేందుకు నీతీ ఆయోగ్, రాకీ మౌంటెన్ ఇన్‌స్టిట్యూట్ బుధవారం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని ‘శూన్య’ అని పిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీరో పొల్యూషన్ డెలివరీ ప్రయోజనాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తారు. 


నీతీ ఆయోగ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ‘శూన్య’ ప్రారంభ కార్యక్రమంలో మహీంద్రా ఎలక్ట్రిక్, టాటా మోటార్స్, జొమాటో, అశోక్ లేలాండ్, సన్ మొబిలిటీ, లైటనింగ్ లాజిస్టిక్స్, బిగ్ బాస్కెట్, బ్లూడార్ట్, హీరో ఎలక్ట్రిక్, స్విగ్గీ వంటి దాదాపు 30 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన నీతీ ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ,  ‘శూన్య’ను భారత దేశ డైనమిక్ ప్రైవేట్ రంగం విజయవంతం చేస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. 


రానున్న రోజుల్లో మరికొందరు పారిశ్రామికవేత్తలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయబోతున్నట్లు నీతీ ఆయోగ్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి పారిశ్రామిక రంగం చేసే కృషికి గుర్తింపునిచ్చి, ప్రోత్సహిస్తారు. 


Updated Date - 2021-09-16T01:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising