ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుది దశలో గ్లోబల్ మినిమం ట్యాక్స్‌పై నిర్ణయం : నిర్మల సీతారామన్

ABN, First Publish Date - 2021-10-07T02:01:33+05:30

అంతర్జాతీయ మినిమం ట్యాక్స్ విధానం తుది దశలో ఉందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మినిమం ట్యాక్స్ విధానం తుది దశలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. బుధవారం ఆమె ICRIER వార్షిక అంతర్జాతీయ జీ20 సదస్సులో మాట్లాడుతూ, అంతర్జాతీయ పన్ను విధానానికి టూ పిల్లర్ సొల్యూషన్ అడ్వాన్స్‌డ్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్‌లో ఉందని చెప్పారు. తాము సంప్రదింపులు జరిపామని, ఓ ఫ్రేమ్‌వర్క్‌కు అంగీకారం కుదిరిందని చెప్పారు. 


అంతర్జాతీయ పన్ను నిబంధనలను ప్రక్షాళన చేయాలని జూలైలో 130 దేశాలు అంగీకారానికి వచ్చాయి. బహుళ జాతి కంపెనీల కార్యకలాపాలు ఎక్కడ జరిగినా మినిమం 15 శాతం రేటుతో పన్ను చెల్లించే విధంగా నిబంధనలు ఉండాలని అంగీకరించాయి. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పట్లో స్పందిస్తూ, కొన్ని ముఖ్యమైన అంశాలకు పరిష్కారం లభించవలసి ఉందని తెలిపింది. లాభాల్లో వాటా కేటాయింపు, పన్ను నిబంధనల పరిధి వంటి అంశాలపై అంగీకారం కుదరవలసి ఉందని పేర్కొంది. ఈ ప్రతిపాదన సాంకేతిక వివరాలను రూపొందించిన తర్వాత అక్టోబరునాటికి ఓ అంగీకారం కుదరవచ్చునని భావిస్తున్నట్లు తెలిపింది.


ప్రతిపాదిత టూ పిల్లర్ సొల్యూషన్‌లో రెండు భాగాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, లాభాల్లో అదనపు వాటా పునఃకేటాయింపులు మొదటి పిల్లర్. ఇక రెండో పిల్లర్, పన్ను నిబంధనలకు లోబడి మినిమం ట్యాక్స్. 


జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం అక్టోబరు 13న వాషింగ్టన్‌లో జరుగుతుంది.


Updated Date - 2021-10-07T02:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising