ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ DNAలోనే దోపిడీ ఉంది.... నిర్మలా సీతారామన్

ABN, First Publish Date - 2021-10-06T01:54:26+05:30

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆస్తుల నగదీకరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆస్తుల నగదీకరణ పథకంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఘాటుగా స్పందించారు. దోపిడీ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని, ఆ విషయం ఆ పార్టీ పరిపాలనా కాలంలో వెల్లడైందని అన్నారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 


కాంగ్రెస్ మనసు నుంచి దోపిడీ అనే విషయం ఎన్నటికీ పోదని నిర్మల సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ పరిపాలనా కాలంలో దోపిడీ కొనసాగిందన్నారు. స్పెక్ట్రం, గనులు, నీరు వంటివాటిలో కాంగ్రెస్ దోపిడీకి పాల్పడిందన్నారు. దోపిడీకి పాల్పడినది కాంగ్రెస్‌వారేనని దుయ్యబట్టారు. మిగతావేవీ ఆలోచించలేనంతగా దోపిడీ అనే పదం కాంగ్రెస్ డీఎన్ఏలో పాతుకుపోయిందన్నారు. 


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్కీమ్ లక్ష్యం దేశాన్ని దోచుకోవడమేనని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించినపుడు నిర్మల సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2021-10-06T01:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising