ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nipah Virus: కడగని పండ్లు తింటే ప్రాణాంతకం: ఎయిమ్స్ నిపుణులు!

ABN, First Publish Date - 2021-09-07T15:17:54+05:30

కేరళలో నిఫా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేరళలో నిఫా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన 12 ఏళ్ల బాలునితో టచ్‌లో ఉన్న 251 మంది వ్యక్తులను కేరళ వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. వీరిలో 38 మందిని కోజికోడ్ మెడికల్ కాలేజీ  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ అశుతోష్ బిశ్వాస్... నిఫా వైరస్‌కు సంబంధించిన పలు విషయాలు తెలిపారు. 


గబ్బిలాల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని  అన్నారు. గబ్బిలాలు సామూహికంగా ఒకచోట ఉంటాయని, ఇదేవిధంగా అవన్నీ మరోచోటుకి తరలివెళతాయని, ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. నిఫా వైరస్‌ను అరికట్టేందుకు ఇంతవరకూ మనదగ్గర తగిన ఔషధం లేదని, ఈ వైరస్ సోకిన బాధితులకు ప్రాణాపాయం ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ వైరస్ గబ్బిలా నుంచి పందులు, గొర్రెలు తదితర జంతువులకు సోకుతుందని తరువాత అది మనుషులకు వ్యాపిస్తుందన్నారు. కొండకోనల నుంచి వచ్చే పండ్లను శుభ్రంగా కడిగిన తరువాతనే తినాలని, లేదంటే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతానికి కేరళ, పశ్చిమ బెంగాల్‌లో నిఫా వైరస్ కేసులు కనిపించాయన్నారు. 

Updated Date - 2021-09-07T15:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising