ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగుచట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ నేడు ఆమోదం..!

ABN, First Publish Date - 2021-11-24T16:26:01+05:30

సాగుచట్టాలను రద్దు చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర కేబినెట్ బుధవారంనాడు సమావేశమవుతోందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సాగుచట్టాలను రద్దు చేసేందుకు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర కేబినెట్ బుధవారంనాడు సమావేశమవుతున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ సమావేశంలోనే రైతు చట్టాలను రద్దు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపనుందని చెబుతున్నారు. అనంతరం చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లులను ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ''సాగు చట్టాల రద్దు బిల్లు, 2021'' పేరుతో లోక్‌సభలో ఈ బిల్లు ప్రవేశపెడతారు.


ప్రధాని నరేంద్ర మోదీ గత శుక్రవారంనాడు దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మూడు సాగుచట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కనీస వేతనాల చట్టానికి (ఎంఎస్‌పీ)కి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వ ఎజాండాలో ఉన్న 26 కొత్త బిల్లుల్లో 'సాగు చట్టాల రద్దు బిల్లు, 2021' కూడా ఉంది.

Updated Date - 2021-11-24T16:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising