ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింఘు బోర్డర్ హత్య: నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ

ABN, First Publish Date - 2021-10-16T21:31:51+05:30

సింఘు సరిహద్దులో శుక్రవారంనాడు ఒక వ్యక్తి దారుణ హత్యకు బాధ్యత వహిస్తూ లొంగిపోయిన నిహాంగ్ సిక్కు సభ్యుడు సరవ్‌జీత్ సింగ్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సింఘు సరిహద్దులో శుక్రవారంనాడు ఒక వ్యక్తి దారుణ హత్యకు బాధ్యత వహిస్తూ లొంగిపోయిన నిహాంగ్ సిక్కు సభ్యుడు సరవ్‌జీత్ సింగ్‌ను సోనిపట్‌లోని కోర్టు ముందు శనివారంనాడు పోలీసులు హాజరుపరిచారు. అతనికి కోర్టు వారం రోజుల రిమాండ్‌కు ఆదేశించింది. ఈ కేసులో మరో నాలుగురు పేర్లను సింగ్ వెల్లడించడంతో వారిని గుర్తించడం కోసం పంజాబ్‌కు అతనిని తీసుకువెళ్లనున్నారు.


దీనికి ముందు, సింగ్‌ను ఖార్కోడా క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. అక్కడి నుండి కుడ్లి పోలీసులు సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం శుక్రవారం తెల్లవారుజామున నిహాగ్ సిక్కుల బృందంతో గత 3,4 రోజుల నుంచి సింఘు సరిహద్దుల్లో ఉన్న లఖ్‌బీర్‌పై పవిత్ర సరబ్‌లోహ్ గ్రంథాన్ని అపవిత్రం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై వేసిన ప్రశ్నలకు లఖ్‌బీర్ సమాధానం చెప్పలేకపోవడం, దీంతో వాదన ముదిరి హింసాత్మకంగా మారింది. ఈ గందరగోళం మధ్య అతని చేతిని నరికివేసినట్టు చెబుతున్నారు. ఛిద్రం చేసిన అతని మృతదేహాన్ని ఢిల్లీ హర్యానా సరిహద్దు వద్దనున్న ఒక పోలీస్ పోస్ట్‌కు కట్టివేసి ఉండగా పోలీసులు కనుగొన్నారు.

Updated Date - 2021-10-16T21:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising