ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి కర్ఫ్యూ లేనట్లే!

ABN, First Publish Date - 2021-12-25T13:47:09+05:30

రాష్ట్రంలో ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారనే పుకార్లకు పుల్‌స్టాప్‌ పడింది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నిబంధనలు పాటించాల్సిందే 

- CM స్టాలిన్‌


చెన్నై: రాష్ట్రంలో ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారనే పుకార్లకు పుల్‌స్టాప్‌ పడింది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైద్యనిపుణుల కమిటీ సభ్యులు, ఆరోగ్యశాఖ అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. కఠిన నిబందనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయకూడదని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో ప్రస్తుతం అములలో ఉన్న కరోనా నిబంధనలను విధిగా పాటించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమావేశానంతరం ప్రకటించారు. ఈ నెల 31తో సడలింపుల లాక్‌డౌన్‌ ముగియనుండటంతో ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తిని నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అందరి అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు, నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ అధికారి డాక్టర్‌ కేఎన్‌ అరుణ్‌కుమార్‌, ఆ సంస్థ వైద్యనిపుణురాలు డాక్టర్‌ సౌమ్యా స్వామినాధన్‌, వేలూరు సీఎండీ డైరెక్టర్‌ జేవీ పీటర్‌, భారతీయ వైద్య మండలి అధ్యక్షులు డాక్టర్‌ పళనిస్వామి, అపోలో ఆస్పత్రి వైద్యనిపుణుడు డాక్టర్‌ వి.రామసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. వైద్యనిపుణులందరి సూచనల మేరకు ప్రస్తుతం సడలింపుల లాక్‌డౌన్‌లో ఎలాంటి మార్పులు లేవని స్టాలిన్‌ ప్రకటించారు. పండుగల సీజన్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంతవరకు గుమికూడ కుడా భౌతికదూరం  పాటించాలని, కరోనా నిరోధక టీకాలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-12-25T13:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising