ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మాయిలకు ‘నో’ ఫోన్‌

ABN, First Publish Date - 2021-01-24T08:31:20+05:30

42శాతం మంది అమ్మాయిలు రోజుకు గంటకన్నా తక్కువసేపే ఫోన్లను వినియోగిస్తున్నారట. ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ కేటలైజింగ్‌ చేంజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ డిజిటల్‌ ఎంపవర్‌మెం ట్‌ ఫౌండేషన్‌(డీఎంఎ్‌ఫ)తో కలిసి నిర్వహించిన సర్వేలో ఈ విషయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రోజుకు గంటకు మించి ఇవ్వని పెద్దలు


న్యూఢిల్లీ, జనవరి 23: 42శాతం మంది అమ్మాయిలు రోజుకు గంటకన్నా తక్కువసేపే ఫోన్లను వినియోగిస్తున్నారట. ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ కేటలైజింగ్‌ చేంజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ డిజిటల్‌ ఎంపవర్‌మెం ట్‌ ఫౌండేషన్‌(డీఎంఎ్‌ఫ)తో కలిసి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో 4,100 మంది టీనేజ్‌ అమ్మాయిలపై నిర్వహించిన సర్వే వివరాలను ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వెల్లడించింది. దేశంలో టీనేజ్‌ అమ్మాయిలకు వారి పెద్దలు డిజిటల్‌ పరికారాలను అందుబాటులో ఉం చడం లేదని తేల్చింది. డిజిటల్‌ పరికరాలు కర్ణాటకలో 65ు మంది అమ్మాయిలకు అందుబాటులో ఉండగా హరియాణలో చాలా తక్కువ మంది అమ్మాయిలు వినియోగిస్తున్నారని చెప్పింది. తెలంగాణలో మాత్రం డిజిటల్‌ పరికరాల వినియోగంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య భేదం 12 శాతమే అని తెలిపింది. టీనేజ్‌ అమ్మాయిలు ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాలు వినియోగించడం వల్ల దారి తప్పుతారని, వారి సామాజిక భద్రతే ప్రమాదంలో పడుతుందనేది పెద్దల భయమని తేల్చింది. అలాగే డిజిటల్‌ వినియోగం తమ అమ్మాయిల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనేది మరికొందరి అభిప్రాయం.

Updated Date - 2021-01-24T08:31:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising