ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 నెలల్లో 20% పెరిగిన న్యూస్‌ప్రింట్‌ ధర

ABN, First Publish Date - 2021-01-17T07:43:10+05:30

న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించాలని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) కోరింది. గత మూడు నెలల్లో న్యూస్‌ప్రింట్‌ ధర 20

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కస్టమ్స్‌డ్యూటీ మినహాయించండి: ఐఎన్‌ఎస్‌


న్యూఢిల్లీ, జనవరి 16 : న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించాలని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) కోరింది. గత మూడు నెలల్లో న్యూస్‌ప్రింట్‌ ధర 20 శాతం మేర పెరిగిందని ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడు ఎల్‌.ఆదిమూలం చెప్పారు. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్‌పై 5 శాతం కస్టమ్స్‌ డ్యూటీని రద్దు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. పత్రికారంగాన్ని ఆదుకునేందుకు బడ్జెట్‌లో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని ఐఎన్‌ఎస్‌ అభ్యర్థించింది.


50 శాతం టారిఫ్‌ పెంపుతో డీఏవీపీ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్వర్టయిజింగ్‌ అండ్‌ విజువల్‌ పబ్లిసిటీ) ద్వారా ప్రకటనలు ఇప్పిస్తే.. పత్రికారంగాన్ని ఆదుకున్నట్లు అవుతుందని పేర్కొంది. అలాగే ఆ టారిఫ్‌ మార్చి 31, 2022 వరకు కొనసాగేలా ఆర్‌ఎన్‌ఐ సర్క్యులేషన్‌ సర్టిఫికెట్ల చెల్లుబాటు గడువును ఆ తేదీ వరకు పొడిగించాలని ఐఎన్‌ఎస్‌ కోరింది. దేశీయంగానూ కాగితం ధర టన్నుకు రూ.3-4 వేల చొప్పున ఇప్పటికే పెరిగిందని గుర్తు చేసింది. 


Updated Date - 2021-01-17T07:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising