ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లజాతి ఉద్యమకారుడు డెస్మండ్‌ టుటు కన్నుమూత

ABN, First Publish Date - 2021-12-27T08:51:15+05:30

నల్లజాతి ఉద్యమకారుడు డెస్మండ్‌ టుటు కన్నుమూత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాఫ్రికాలో జాతి, వర్ణ వివక్షపై సుదీర్ఘ పోరాటం

సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ


జొహన్నె్‌సబర్గ్‌, డిసెంబరు 26: నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, మానవహక్కుల కార్యకర్త, జాతి, వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్చిబిషప్‌ డెస్మండ్‌ టుటు (90) ఆదివారం కన్నుమూశారు. దేశాధ్యక్షుడు సైరిల్‌ రమఫొసా ఈ విషయాన్ని ప్రకటించారు. 1931 అక్టోబరు 7న జన్మించిన డెస్మండ్‌ టుటు.. గొప్ప వేదాంతిగా పేరొందారు. 1985-86 మధ్య కాలంలో జొహన్నె్‌సబర్గ్‌ బిష్‌పగానూ.. 1986 నుంచి 96 వరకు కేప్‌టౌన్‌ ఆర్చి బిష్‌పగానూ ఆయన పనిచేశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తుదిశ్వాస విడిచారు. డెస్మండ్‌ టుటు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. అణగారిన వర్గాలకు డెస్మండ్‌ టుటు చేసిన సేవలు మరువలేనివని ప్రధాని మోదీ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఆధ్యాత్మిక వేత్త దలైలామా పేర్కొన్నారు. డెస్మండ్‌ టుటు.. ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాతని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు.

Updated Date - 2021-12-27T08:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising