ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Zealand: కొవిడ్ డెల్టా వేరియంట్‌తో ఫస్ట్ డెత్

ABN, First Publish Date - 2021-09-04T13:54:16+05:30

న్యూజిలాండ్ దేశంలో కొవిడ్-19 డెల్టా వేరియంట్ ప్రభావంతో ఒకరు మరణించడం సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆక్లాండ్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్ దేశంలో కొవిడ్-19 డెల్టా వేరియంట్ ప్రభావంతో ఒకరు మరణించడం సంచలనం రేపింది. న్యూజిలాండ్ దేశంలో డెల్టావేరియంట్ వల్ల మొదటి మరణం నమోదైంది.ఫిబ్రవరి నుంచి న్యూజిలాండ్ దేశంలో సంభవించిన మొదటి మరణమని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఆక్లాండ్ నగరంలో 20 రోజుల క్రితం 90 ఏళ్ల వృద్ధురాలికి కరోనా డెల్టావేరియంట్ సోకిందని, ఆమెకు ఇతర ఆరోగ్యసమస్యలు ఉండటంతో శనివారం మరణించిందని వైద్యాధికారులు చెప్పారు. కరోనా మృతి తమ సమాజానికి కలిగే నష్టాన్ని గుర్తు చేస్తుందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ చెప్పారు. 


అంతర్లీన ఆరోగ్య సమస్యలున్న వారు కరోనా వైరస్ సోకితే ప్రమాదంలో పడుతున్నారని, కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ఒక్కటే ముఖ్యమని ప్రధాని చెప్పారు. ఆగస్టు మధ్య నుంచి కఠినమైన లాక్ డౌన్ ను తొలగించడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. న్యూజిలాండ్ దేశంలో ప్రస్థుతం 782 క్రియాశీల కరోనా కేసులున్నాయి. ఆక్లాండ్ నగరంలో 765, రాజధాని నగరమైన వెల్లింగ్టన్ లో 17 కరోనా యాక్టివ్ కేసులు వెలుగుచూశాయి.ఐదు మిలియన్ల దేశమైన న్యూజిలాండ్ లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 3,392 కొవిడ్ -19 కేసులు నమోదు కాగా,  27 మంది కరోనాతో మరణించారు.

Updated Date - 2021-09-04T13:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising