ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18న తమిళనాడు నూతన గవర్నర్‌ ప్రమాణస్వీకారం..

ABN, First Publish Date - 2021-09-15T15:49:23+05:30

చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆర్‌ఎన్‌ రవి ఈనెల 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. భన్వరీ లాల్‌ పురోహిత్‌ పంజాబ్‌ గవర్నర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో నాగాలాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆర్‌ఎన్‌ రవి ఈనెల 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. భన్వరీ లాల్‌ పురోహిత్‌ పంజాబ్‌ గవర్నర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో నాగాలాండ్‌ గవర్నర్‌గా ఉన్న ఆర్‌ఎన్‌ రవిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 1976 కేరళ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి రవి సీబీఐలో ఇంటెలిజెన్స్‌ ప్రత్యేక అధికారిగా పనిచేశారు.  తర్వాత 2019లో నాగాలాండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.


నాగలాండ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలతో శాంతి  కోసం జరిగిన చర్చల్లో రవి కీలకపాత్ర పోషించి కేంద్ర ప్రభుత్వ ప్రశంసలందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎన్‌ రవి ఈనెల 18న రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  స్టాలిన్‌, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు పాల్గొంటారు.

Updated Date - 2021-09-15T15:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising