ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా వేసుకోకుంటే ఫోన్ బ్లాక్

ABN, First Publish Date - 2021-06-14T00:25:30+05:30

టీకా వేసుకోకుంటే ఫోన్ బ్లాక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్: కరోనా భయంతో ప్రపంచ దేశాల్లో టీకా కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. కాగా, పాకిస్తాన్‌లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్‌లు లాంటి వదంతులతో టీకాపై ప్రజలు విముఖత చూపిస్తున్నారు. మొదటి డోసు టీకా తీసుకున్నవారు చాలా మంది రెండో డోసు తీసుకోవడం లేదట. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ వదంతుల నుంచి ప్రజలు బయటపడటం లేదు. దీంతో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే టీకా వేసుకోరో వారి మొబైల్ ఫోన్ లేదా నెట్‌వర్క్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించారు.


‘‘ఈ పద్దతిని మొదట్లో ఒక ప్రాతిపదికగానే తీసుకున్నాం. అయితే టీకా వేసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో చట్టం చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని టెలికాం సంస్థలు నిర్ణయిస్తాయి’’ అని పంజాబ్ ప్రావిన్స్ ఆరోగ్యశాఖ ప్రతినిధి హమ్మద్ రజా వెల్లడించారు.

Updated Date - 2021-06-14T00:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising