ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గౌతం గంభీర్‌పై విరుచుకుపడుతున్న నెటిజెన్లు

ABN, First Publish Date - 2021-04-21T20:06:11+05:30

‘‘గంభీర్ నువ్వు నరేంద్రమోదీకి బుదులు వేరొక వ్యక్తిని తప్పుగా ట్యాగ్ చేశారు’’ అని ఒకరు స్పందించగా ‘‘విజన్ లేదు, డెరెక్షన్ లేదు. దేశ ప్రజలు చనిపోతున్నారు. మీకేమైనా సిగ్గునిపిస్తుందా? అలా అనిపిస్తే వెంటనే రాజీనామా చేయండి మోదీ’’ అని మరో నెటిజెన్లు రాసుకొచ్చాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రవాల్‌ను రాజీనామా చేయాలంటూ వ్యాఖ్యానించిన మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్‌పై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కోవిడ్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తూనే.. గంభీర్ నియోజకవర్గమైన ఈశాన్య ఢిల్లీ పరిస్థితి దారుణంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాజీనామా చేయాల్సింది కేజ్రీవాల్ కాదని, కోవిడ్‌ను అదుపు చేయలేని దేశాధినేత ప్రధాని మోదీని రాజీనామా చేయమని అడగండంటూ చురకలు అంటిస్తున్నారు.


ఢిల్లీలో కొంత కాలంగా కోవిడ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 20-30 వేల మధ్య కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా గంభీర్ స్పందిస్తూ ‘‘విజన్ లేదు, డెరెక్షన్ లేదు. ఢిల్లీ ప్రజలు చనిపోతున్నారు. మీకేమైనా సిగ్గునిపిస్తుందా? అలా అనిపిస్తే వెంటనే రాజీనామా చేయండి కేజ్రీవాల్’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు.


ఇక దీనిపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘‘గంభీర్ నువ్వు నరేంద్రమోదీకి బుదులు వేరొక వ్యక్తిని తప్పుగా ట్యాగ్ చేశారు’’ అని ఒకరు స్పందించగా ‘‘విజన్ లేదు, డెరెక్షన్ లేదు. దేశ ప్రజలు చనిపోతున్నారు. మీకేమైనా సిగ్గునిపిస్తుందా? అలా అనిపిస్తే వెంటనే రాజీనామా చేయండి మోదీ’’ అని మరో నెటిజెన్లు రాసుకొచ్చాడు.


గత మూడు నాలుగు రోజుల నుంచి ‘మోదీని రాజీనామా చేయండి’ అంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. మమతా బెనర్జీ, తేజ్ ప్రతాప్ యాదవ్ సహా ఇతర నేతలు కూడా మోదీని రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కేజ్రీవాల్‌ను రాజీనామా చేయాలంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలు నెటిజెన్ల ఆగ్రహానికి గురయ్యాయి.



Updated Date - 2021-04-21T20:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising