ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SEXIST COMMENT : నెట్‌ఫ్లిక్స్‌పై లేడీ చెస్ గ్రాండ్‌మాస్టర్ సీరియస్

ABN, First Publish Date - 2021-09-19T00:27:25+05:30

ఒక్క తప్పుడు మాట కారణంగా 5 మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా పడింది నెట్‌ఫ్లిక్స్‌పైన. అది వేసింది కూడా ఎవరో సాధారణ వ్యక్తి కాదు. ప్రపంచపు తొలి మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్ నోనా గాప్రిండాష్విల్లీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్క తప్పుడు మాట కారణంగా 5 మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా పడింది నెట్‌ఫ్లిక్స్‌పైన. అది వేసింది కూడా ఎవరో సాధారణ వ్యక్తి కాదు. ప్రపంచపు తొలి మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్ నోనా గాప్రిండాష్విల్లీ. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన జార్జియా దేశంలో పుట్టిన ఆమె, 1970లలో చదరంగంలో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోన్న ‘క్వీన్స్ గ్యాంబిట్’ సిరీస్‌లో ఆమె గురించిన ఒక ప్రస్తావన ఉంది. అదే వివాదానికి కారణమైంది.


‘క్వీన్స్ గ్యాంబిట్‘ సిరీస్‌లో ఒక చోట ‘‘నోనా... గ్రాండ్‌మాస్టరే అయినప్పటికీ ఆమె ఎప్పుడూ మగవాళ్లును చెస్ బోర్డ్‌పై ఎదుర్కొలేదు’’ అనే డైలాగ్ ఉంటుంది. దీనిపై 80 ఏళ్ల నోనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అప్పట్లో 59 మంది మేల్ చెస్ ప్లేయర్స్‌ని, అందులో 10 మంది గ్రాండ్‌మాస్టర్స్‌ని సైతం... ఎదుర్కొన్నానని చెప్పారు. తన ప్రతిభని అవమానించే విధంగానే కాక లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యని ఉద్దేశ్యపూర్వకంగా ప్రయోగించటంపై ఆమె కోర్టును ఆశ్రయించారు. ‘క్వీన్స్ గ్యాంబిట్‘ సిరీస్ స్ట్రీమింగ్ చేస్తోన్న నెట్‌ఫ్లిక్స్ తనకు 5 మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-19T00:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising