ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మా నాన్న జయంత్యుత్సవాలు నిర్వహించడం ఆనందమే..’ అయితే.. : అనితా బోస్

ABN, First Publish Date - 2021-01-24T02:35:54+05:30

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125 జయంత్యుత్సవాల నిర్వహణపై ఆయన కుమార్తె అనితా బోస్ స్పందించారు. ఇలా జయంత్యుత్సవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125 జయంత్యుత్సవాల నిర్వహణపై ఆయన కుమార్తె అనితా బోస్ స్పందించారు. ఇలా జయంత్యుత్సవాలు నిర్వహించడం అత్యంత ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతాజీకి గౌరవం లభించడం ఆనందంగా ఉందని, జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ప్రధాని మోదీ కోల్‌కతాకు రావడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆయనకు లభించాల్సినంత గౌరవం మాత్రం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా... తన తండ్రిని దేశ ప్రజానీకం గుర్తుంచుకోవడం, ఆయన ప్రేమించడం చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతోందని, దేశం కోసం నేతాజీ ఎంతో చేశారని గుర్తు చేసుకున్నారు.


ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం లభించి, ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఆయనకు సంబంధించిన చాలా పత్రాలు ఇంకా అందుబాటులోకి రాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు బీజేపీ, ఇటు తృణమూల్ రెండూ నేతాజీతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే అటు మోదీ, ఇటు మమత ఇద్దరూ నేతాజీని ఆరాధించేవారే అని, అయితే ఎన్నికల ముందు ఇలా చేయడం ఏమీ బాగోలేదని ఆమె వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-01-24T02:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising