ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగాల్‌ వచ్చే వారికి కరోనా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి

ABN, First Publish Date - 2021-05-07T15:54:36+05:30

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి రైలు ద్వారా వస్తున్న ప్రయాణికులు 72 గంటల ముందు చేయించుకున్న కరోనా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా (పశ్చిమబెంగాల్) : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి రైలు ద్వారా వస్తున్న ప్రయాణికులు 72 గంటల ముందు చేయించుకున్న కరోనా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని సర్కారు ఆదేశించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని, వారినే అనుమతిస్తామని పశ్చిమబెంగాల్ సర్కారు తాజాగా నిర్ణయించింది.కరోనా కట్టడి కోసం బెంగాల్ తోపాటు పలు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రైళ్లలో ఎక్కే ప్రయాణికులకు థర్మల్  స్కానింగ్ చేయాలని, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదిక ఉన్న వారినే రైళ్లలోకి అనుమతించాలని పశ్చిమబెంగాల్ హోం శాఖ కార్యదర్శి హెచ్ కే దివేది రైల్వే ఉన్నతాధికారులకు రాసిన లేఖలో కోరారు. బెంగాల్ ఎన్నికల పర్వం వల్ల తాజాగా మొత్తం 1,21,872 కరోనా కేసులు నమోదవడంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించింది.

Updated Date - 2021-05-07T15:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising