ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నీట్‌’పై డీఎంకే ద్వంద్వ వైఖరి

ABN, First Publish Date - 2021-07-21T14:49:25+05:30

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ‘నీట్‌’ రద్దుచేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన హామీ ఏమైందని, ముఖ్య మంత్రి స్టాలిన్‌ నీట్‌ వ్యవహారంలో ద్వంద్వవైఖరిని అవలంభిస్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - మాజీ మంత్రి డి.జయకుమార్‌


ప్యారీస్‌(చెన్నై): తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ‘నీట్‌’ రద్దుచేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన హామీ ఏమైందని, ముఖ్య మంత్రి స్టాలిన్‌ నీట్‌ వ్యవహారంలో ద్వంద్వవైఖరిని అవలంభిస్తున్నారని  మాజీ మంత్రి డి.జయకుమార్‌ విమర్శించారు. రాయపురం నియోజకవర్గం లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నీట్‌ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం స్పష్టత లేని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 2010వ సంవత్సరం అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న హయాంలో నీట్‌ను పరిచయం చేశారని మంత్రి సుబ్రమణ్యం చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని, వాస్తవానికి 2010లో తమిళనాడులో డీఎంకే, కేంద్రంలో డీఎంకే భాగస్వామ్యం వహించిన కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం కూడా మంత్రి హోదాలో ఉన్న సుబ్రమణ్యంకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. డీఎంకే ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే నీట్‌ పరీక్ష రద్దుచేస్తామని ప్రకటించారని, అయితే ఈ సంవత్సరం ఈ పరీక్ష జరుగుతుందా? లేదా? అని కూడా తెలియని స్థితిలో విద్యార్థులు సతమతమవుతున్నారని తెలిపారు. నీట్‌ కమిటీ ప్రతిపాదన వల్ల ఈ పరీక్ష రద్దు చేయడం సాధ్యం కాదని, దేశంలో నీట్‌ను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు కూడా ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేసు కున్నాయా? అని జయకుమార్‌ సూటిగా ప్రశ్నించారు. ఎడప్పాడి పళని స్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంబీబీఎస్‌లో చేరే కలను సాకారం చేసేలా 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించారని, అయితే డీఎంకే ప్రభుత్వం నీట్‌పై స్పష్టత లేకుండా వ్యవ హరించడం సరికాదని జయకుమార్‌ పేర్కొన్నారు.


Updated Date - 2021-07-21T14:49:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising