ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ని..ని..ని..ని.. నీలగిరి!

ABN, First Publish Date - 2021-12-24T16:43:50+05:30

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాంతమైన నీలగిరి జిల్లాలో రాత్రి, పగటిపూట ఉష్ణోగత్రలు దారుణంగా పడిపో తున్నాయి. సాధారణంగా ఈ జిల్లాలో మార్గళి మాసం ప్రారంభంలో పొగమంచు బాగా కురుస్తుంది. ఆ తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వణుకుతున్న పర్యాటక ప్రాంతం 

- పడిపోయిన ఉష్ణోగ్రతలు


అడయార్‌(చెన్నై): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాంతమైన నీలగిరి జిల్లాలో రాత్రి, పగటిపూట ఉష్ణోగత్రలు దారుణంగా పడిపో తున్నాయి. సాధారణంగా ఈ జిల్లాలో మార్గళి మాసం ప్రారంభంలో పొగమంచు బాగా కురుస్తుంది. ఆ తర్వాత జనవరి నెలలో అధికంగా ఉంటుంది. అయితే, ఈ దఫా రెండు రోజుల క్రితం దట్టంగా పొగమంచు కురిసింది. అప్పటి నుంచి ఈ పొగమంచు వరుసగా కమ్మేస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం పచ్చికబయళ్ళు, చెట్ల ఆకులు, కొమ్మలపై మంచు తెల్లదుప్పటి కప్పినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఊటీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈ పొగమంచు అధికంగా కురుస్తోంది. ఈ కారణంగా తీవ్రమైన చలితో స్థానికులు వణికిపోతున్నారు. బుధవారం ఊటీలో గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్‌, కనిష్టంగా 3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నీటి వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలతోపాటు లోయ ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. 

Updated Date - 2021-12-24T16:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising