ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాక్ష్యాలుంటే కోర్టుకు వెళ్లండి: మంత్రిపై ఎన్‌సీబీ మండిపాటు

ABN, First Publish Date - 2021-11-07T20:16:08+05:30

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేసిన తాజా ఆరోపణలపై ఎన్‌సీబీ అధికారులు స్పందించారు. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాలుంటే ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. దుబాయ్, మాల్దీవుల్లో వాంఖడే ఉన్నారని, బీజేపీ నేత మోహిత్ భారతీయ (మోహిత్ కాంబోజ్)తో మాట్లాడారని వాంఖడేపై నవాబ్ మాలిక్ ఆదివారంనాడు తాజా ఆరోపణలు చేశారు.


షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కిడ్నాప్‌‌ కుట్రలో సమీర్ వాంఖడే పాత్ర ఉందని, నిజానికి ఇది కిడ్నాప్, బలవంతపు వసూళ్లకు సంబంధించిన కేసు అని నవాబ్ మాలిక్ ఆరోపించారు. క్రూయిజ్ పార్టీలో పాల్గొనేందుకు ఎలాంటి టిక్కెట్టు ఆర్యన్ కొనుగోలు చేయలేదని, ప్రతీక్ గాబ, అమీర్ ఫర్నిచల్‌వాలాలు ఆర్యన్‌కు క్రూయిజ్ షిప్‌పైకి తీసుకు వెళ్లారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్‌సీబీ అధికారులు వెంటనే స్పందించారు. ఇందుకు తగిన ఆధారాలు ఉంటే నేరుగా కోర్టుకే వెళ్లొచ్చు కదా అని ప్రశ్నించారు. వాంఖడే ఎన్‌సీబీ ఇన్‌ఫార్మర్ కాదని, శామ్ డిసౌతో‌ ఎలాంటి పరిచయాలు లేవని అన్నారు.

Updated Date - 2021-11-07T20:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising