ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Navi Mumbai: నేటినుంచి మెట్రో రైలు ట్రయల్స్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-28T14:07:26+05:30

నవీ ముంబై నగరవాసుల మెట్రో రైలు కల త్వరలో సాకారం కానుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీ ముంబై: నవీ ముంబై నగరవాసుల మెట్రో రైలు కల త్వరలో సాకారం కానుంది. నవీముంబైలో కొత్తగా మెట్రోరైలు నిర్మాణం చేపట్టి, శనివారం నుంచి ట్రయల్స్ ప్రారంభించారు. ప్రయాణికులకు మెట్రోరైలు సేవలు అందించడానికి ముందు భారతీయ రైల్వే పరిశోధనా విభాగం బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్ లు, మెట్రో రైలు భద్రతను ట్రయల్స్ లో పరీక్షిస్తోంది.ఇండియన్ రైల్వేస్ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నవీ ముంబై రూట్లలో మెట్రోరైలు ట్రయల్స్ చేపట్టింది. నవీ ముంబై మెట్రో ప్రాజెక్ట్ కింద నాలుగు ఎలివేటెడ్ కారిడార్లు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ద్వారా అభివృద్ధి చేశారు.ట్రయల్స్ తర్వాత త్వరలో ప్రయాణికుల కోసం మెట్రోరైలు సేవలను ప్రారంభించాలని సిడ్కో లక్ష్యంగా పెట్టుకుంది.


 పెంధర్ మెట్రోరైల్వేస్టేషన్ నుంచి సెంట్రల్ పార్కు స్టేషన్ వరకు మెట్రోలైన్ 1 ట్రయల్స్ చేపట్టినట్లు సిడ్కో ట్వీట్ చేసింది.నవీ ముంబై మెట్రో ప్రాజెక్టును నాలుగు దశలుగా విభజించారు.మొదటిది బేలాపూర్ రైల్వే స్టేషన్‌లో మొదలై తలోజా సమీపంలోని పెందార్ స్టేషన్‌లో ముగుస్తుంది. ప్రస్తుతం నిర్మించిన మార్గంలో 11 స్టేషన్లు 11.10 కిమీ విస్తరించి ఉన్నాయి. రెండవ దశ ఖండేశ్వర్, తలోజా లను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడవది పెంధర్, తలోజా , ఎంఐడీసీల మధ్య ప్రణాళిక చేశారు.నవీ ముంబై మెట్రో నాల్గవ , చివరిదశ ఖండేశ్వర్,నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంల మధ్య కనెక్టివిటీని అందించనుంది.


Updated Date - 2021-08-28T14:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising