ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

restrictions :నైనిటాల్‌లో పర్యాటకులపై ఆంక్షలు

ABN, First Publish Date - 2021-07-12T18:20:51+05:30

ప్రముఖ పర్యాటక కేంద్రమైన నైనిటాల్‌లో కరోనా వైరస్ ప్రబలుతుందనే భయంతో పర్యాటకుల రద్దీని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నైనిటాల్ : ప్రముఖ పర్యాటక కేంద్రమైన నైనిటాల్‌లో కరోనా వైరస్ ప్రబలుతుందనే భయంతో పర్యాటకుల రద్దీని తగ్గించేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారాంతాల్లో పర్యాటకులు ద్విచక్రవాహనాలపై నైనిటాల్ లోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. పర్యాటకులు ఆర్టీపీసీఆర్ రిపోర్టుతోపాటు నైనిటాల్ లో వసతి రిజర్వేషన్ ఉన్న వారికే పోలీసులు నైనిటాల్ లోకి అనుమతించారు. ఆదివారం పదివేల మంది పర్యాటకులు హిల్ స్టేషన్ అయిన కుమావున్ ప్రాంతానికి వచ్చారరు. దీంతో పోలీసులు పర్యాటకుల రద్దీ తగ్గించడానికి ఆంక్షలు విధించారు. ఉత్తర భారతదేశం నుంచి పర్యాటకులు ఉత్తరాఖండ్ పర్యాటక ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 


దీంతో పర్యాటకుల మధ్య సామాజిక దూరం ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకులు మాస్కులు ధరించకుండా తరలివస్తుండటంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.నైనిటాల్‌కు వచ్చే ఎవరైనా స్మార్ట్ సిటీ పోర్టల్‌లో వారి పేర్లను నమోదు చేసుకోవాలని నైనిటాల్ జిల్లా మెజిస్ట్రేట్ ధీరజ్ సింగ్ కోరారు. పర్యాటకుల రాకకు 72 గంటల లోపు నిర్వహించిన ఆర్టీ-పిసిఆర్ పరీక్ష యొక్క ప్రతికూల నివేదిక తప్పనిసరిగా ఉండాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. నైనిటాల్, డెహ్రాడూన్, ముస్సోరీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో హోటళ్ళలో 50శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 


Updated Date - 2021-07-12T18:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising