ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్ దంపతుల నుంచి కోటి రూపాయల డిమాండ్.. మహిళ అరెస్ట్..

ABN, First Publish Date - 2021-06-17T05:27:21+05:30

డాక్టర్ దంపతుల నుంచి రూ.కొటి డిమాండ్.. మహిళ అరెస్ట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: ఓ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స చేయించుకుని కోలుకున్న కిలాడీ లేడీ... అదే ఆస్పత్రి వైద్యులను బెదిరించి భారీగా డబ్బు దండుకునేందుకు ప్రయత్నించిన వైనమిది. డాక్టర్ దంపతులు తమ పిల్లలు క్షేమంగా ఉండాలంటే కోటి రూపాయలు ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితురాలిని మనీశ్ నగర్‌కి చెందిన 46 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తించారు. ఆమె భర్త టెలీకం శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. నగరంలో ఓ ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్ దంపతులకు ఈ నెల 11న కొరియర్ ద్వారా లేఖ అందిందని పోలీసులు వెల్లడించారు. డాక్టర్ దంపతుల కుమార్తె, కుమారుడు క్షేమంగా ఉండాలంటే తనకు రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేసింది. డబ్బులు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఆమె హెచ్చరించారు. దీనిపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఓ సీసీటీవీ ఫూటేజీతో పాటు మరికొన్ని ఇతర క్లూస్ అధారంగా నిందితురాలిని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెలలో సదరు మహిళ, ఆమె భర్త ఇక్కడే కొవిడ్-19 చికిత్స పొంది కోలుకున్నారని బల్తరోడి పోలీస్ ఇన్‌స్పెక్టర్ అజయ్ అకోట్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-17T05:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising